ముంబై టు హైదరాబాద్ హైస్పీడ్ బుల్లెట్ ట్రైన్

0
63

ముంబై టు హైదరాబాద్.. హైస్పీడ్ బుల్లెట్ ట్రైన్
న్యూఢిల్లీ: దేశంలో మరో ఏ డు రూట్లలో హైస్పీడ్ బుల్లెట్ ట్రైన్స్ ప్రవేశపెట్టా లని కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇందు కోసం ఇండియన్ రైల్వే, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్ హెచ్ ఏఐ) ఆధ్వర్యంలో భూ సేకరణ ప్రారంభించాలని కేంద్ర మంత్రి గడ్కరీ ఆధ్వర్యంలో పలువురు మంత్రుల టీమ్ గురువారం ఢిల్లీలో జరిగిన మీటింగ్ లో నిర్ణయం తీసుకుంది. భూ సేకరణను స్పీడ్ గా చేపట్టేందుకు నలుగురు మంత్రులతో ఓ టీమ్ ను కూడా ఏర్పాటు చేశారు.

ముఖ్యంగా గ్రీన్‌‌ఫీల్డ్ ఎక్స్‌‌ప్రెస్‌‌వేల వెంట ఈ ప్రాజెక్టు కోసం ట్రాక్‌‌లు వేయడానికి భూమిని సేకరిస్తారని సమాచారం. ఇప్పటికే ఈ రూట్లలో రైల్వే కారిడార్ కు సంబంధించిన వివరాలను ఎన్‌‌హెచ్‌‌ఐఐకు అందిం చిన రైల్వే శాఖ.. త్వరలోనే పనులు ప్రారంభించాలని, ఇందుకు ఓ నోడ ల్ ఆఫీసర్ ను నియ మించాలని కోరింది. ఇదిలా ఉంటే ఏడు హైస్పీడ్ రైలు మార్గాల బ్లూ ప్రింట్‌‌ను ఇండియన్ రైల్వే ఇప్పటికే రెడీ చేసినట్టు సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here