ఇక 30 సెకండ్లు కోవిడ్ నిర్ధారణ పరీక్ష

0
63

4 రకాల సాంకేతికతలను పరీక్షిస్తున్న భారత్, ఇజ్రాయెల్‌

దిల్లీ: కొవిడ్‌ బాధితులను అత్యంత వేగంగా గుర్తించగల సరికొత్త పరీక్షల అభివృద్ధి దిశగా భారత్, ఇజ్రాయెల్‌ సంయుక్తంగా కృషి చేస్తున్నాయి. వ్యక్తుల స్వరం, శ్వాస విశ్లేషణ వంటి కొంగొత్త పరీక్షలు ఇందులో ఉన్నాయి. కేవలం 30 సెకన్లలోనే వ్యాధి నిర్ధారణ జరపడం వాటి ప్రత్యేకత. ఈ శీఘ్ర పరీక్షలను భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీవో), శాస్త్రీయ-పారిశ్రామిక పరిశోధక మండలి (సీఎస్‌ఐఆర్‌), భారత ప్రధాన శాస్త్రీయ సలహాదారు, ఇజ్రాయెల్‌కు చెందిన రక్షణ పరిశోధన, అభివృద్ధి డైరెక్టరేట్‌ సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్నాయి. అందులో ఒకటి స్వర విశ్లేషణ. ఈ రకమైన పరీక్షలో కరోనా బాధితుల స్వరంలో తేడాలను కృత్రిమ మేధస్సు(ఏఐ) గుర్తించి, వ్యాధి నిర్ధారణ జరుపుతుంది. మరో రకమైన పరీక్షలో వ్యక్తులు ఒక ట్యూబ్‌లోకి గాలిని ఊదాల్సి ఉంటుంది. టెరా-హెర్ట్జ్‌ తరంగాల ద్వారా అందులో వైరస్‌ నిర్ధారణ జరుగుతుంది. లాలాజల నమూనాలో కరోనాను గుర్తించే ఐసోథర్మల్‌ పరీక్ష, కొవిడ్‌-19కు సంబంధించిన ప్రొటీన్లను పాలీ అమైనో ఆమ్లాలతో గుర్తించే విధానం కూడా భారత్, ఇజ్రాయెల్‌ అభివృద్ధి చేస్తున్నవాటిలో ఉన్నాయి. ఈ నాలుగు పరీక్షలు/సాంకేతికతలను దిల్లీలోని రామ్‌ మనోహర్‌ లోహియా ఆస్పత్రిలో మూడు రోజులుగా పరీక్షిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here