ప్రముఖ నటుడు రచయిత రావికొండలరావు మృతి

0
84

: ప్రముఖ , సినీ జర్నలిస్టు, నటుడు, రచయిత, దర్శకుడు రావి కొండలరావు ఇకలేరు. కొద్దికాలంగా వృద్దాప్య సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న ఆయన మంగళవారం గుండెపోటుతో మరణించారు. ఆయన మృతితో తెలుగు, తమిళ సినీ పరిశ్రమ తీవ్ర దిగ్బ్రాంతికి గురైంది. ఆయన మృతికి పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. రావి కొండలరావు మరణంతో సినీ పరిశ్రమ గొప్ప నటుడిని, రచయితను కోల్పోయింది అంటూ తమ సంతాప ప్రకటనలో పేర్కొంటున్నారు. రావి కొండలరావు సీనీ, వ్యక్తిగత జీవితం గురించి వివరాల్లోకి వెళితే..
రావి కొండల రావు 1932 ఫిబ్రవరి 11వ తేదీన శ్రీకాకుళంలో జన్మించారు.: ఆయన వయసు 88 సంవత్సరాలు. ఆయన భార్య, ప్రముఖ నటి రాధాకుమారి 2012లో మరణించారు. ఆయనకు శశి కుమార్ అనే కుమారుడు ఉన్నారు. ఆయన మంగళవారం గుండెపోటుతో హైదరాబాద్‌లో మరణించారు. 600 చిత్రాల్లో నటించి..

నటుడిగా రావి కొండలరావు 600 చిత్రాల్లో నటించారు. దర్శకుడిగా పలు చిత్రాలను రూపొందించారు. 1958లో శోభ చిత్రంతో కొండలరావు సినీ ప్రస్థానం మొదలైంది. 1965లో తేనే మనసులు చిత్రంతో నటుడిగా గుర్తింపు పొందారు. ప్రేమించి చూడు, రాముడు భీముడు, అలీ బాబా 40 దొంగలు, అందాల రాముడు, దసరా బుల్లోడు, జీవిత చక్రం, రంగూన్ రౌడీ, చంటబ్బాయ్, ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్లాం, పెళ్లి పుస్తకం, బృందావనం, మేడమ్, భైరవద్వీపం, రాధా గోపాళం, మీ శ్రేయోభిలాషి, కింగ్, ఓయ్, వరుడు, 365 డేస్ లాంటి చిత్రాలతో ఆయన తన నటనతో ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా స్థానం దక్కించుకొన్నారు.

సినీ జర్నలిస్టుగా సేవలు

తెలుగు సినిమా పరిశ్రమలో సినీ జర్నలిస్టుగా ప్రవేశించారు. ఆ తర్వాత నటుడిగా మారారు విభిన్నమైన పాత్రలతో ఆకట్టుకొన్నారు. ఆ తర్వాత దర్శకుడిగా మారారు. దాదాపు ఏడు దశాబ్దాలపాటు సినీ పరిశ్రమతో అనుబంధం ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here