గుడ్ న్యూస్.. సినిమా థియేటర్లు రీఓపెనింగ్

0
101

హైదరాబాద్ : కరోనా వ్యాప్తి నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్ వల్ల దేశ వ్యాప్తంగా సినిమా థియేటర్లు బంద్‌ అయిన విషయం తెలిసిందే. వాటిని వచ్చే నెలలో మళ్లీ తెరవాలని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ సిఫారసు చేసింది. ఆ శాఖ కార్యదర్శి అమిత్ ఖరీ సినిమా పరిశ్రమ ప్రతినిధులతో జరిగిన సమావేశంలో ఈ విషయం తెలిపారు. ఈ విషయంపై తుది నిర్ణయాన్ని త్వరలోనే కేంద్ర హోంమంత్రిత్వశాఖ కార్యదర్శి అజయ్ భల్లా తీసుకుంటారని చెప్పారు. కరోనా కట్టడి జాగ్రత్తలో భాగంగా సీట్ల మధ్య ఖాళీ ఉంచి భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని తాము కేంద్ర హోం శాఖకు తెలిపామని వెల్లడించారు. ప్రేక్షకుడికి, ప్రేక్షకుడికి మధ్య కనీసం రెండు మీటర్ల దూరం ఉండేలా చర్చలు తీసుకోవాలని సూచించామని, ఈ మేరకు చర్యలు తీసుకోవాలని థియేటర్ల యజమానులతో మాట్లాడతామని చెప్పారు ఆయితే, భౌతిక దూరం నిబంధనల వల్ల సినిమా థియేటర్లలో కేవలం 25 శాతం మంది ప్రేక్షకులు మాత్రమే కూర్చుని చూసే అవకాశం ఉంటుంది. దీంతో ఇంత తక్కువ మంది ప్రేక్షకులతో సినిమా థియేటర్లు నడపలేమని సినిమా హాళ్ల యజమానులు అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here