Home నెల్లూరు కావలిలో కొవిద్ సెంటర్ ను తనిఖీ చేసిన జేసీ ప్రభాకర్ రెడ్డి

కావలిలో కొవిద్ సెంటర్ ను తనిఖీ చేసిన జేసీ ప్రభాకర్ రెడ్డి

కావలి పట్టణంలో కోవిడ్ కేర్ సెంటర్ ను (tidco) తనిఖీ చేస్తున్న జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎన్. ప్రభాకర్ రెడ్డి… ఈ సందర్భంగా ఆయన covid-19 సోకిన పలువురు బాధితులతో సామాజిక దూరం పాటిస్తూ ప్రత్యక్షంగా మాట్లాడారు. అక్కడ ఏర్పాటు చేసిన వసతులు, ఆహార నాణ్యత వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు కరోనా బాధితుల వద్దకు నేరుగా వెళ్లి జాయింట్ కలెక్టర్ వారి సమస్యలను అడిగి తెలుసుకోవడం తో ఇక్కడ చికిత్స పొందుతున్న తమకు అందుతున్న సేవలను జాయింట్ కలెక్టర్ కు తెలిపి తమ కృతజ్ఞతలు తెలియజేశారు ఎటువంటి సమస్య ఉన్న తనకు నేరుగా ఫోన్ చేయవచ్చునని జేసీ భరోసా కల్పించారు. జిల్లా అధికార యంత్రాంగం మొత్తం కరోనా బాధితులకు అండగా ఉంటుందని ఎవరు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. అనంతరం ఆయన అధికారులకు పలు సూచనలు జారీ చేశారు. కరోనా బాధితులకు ఎటువంటి సేవ లోపాలు లేకుండా చూడాలన్నారు. భోజన మెనూ తెలుసుకొని వారికి మరింత పౌష్టికాహారం అందజేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కావలి ఆర్డీవో దాసు కావలి మున్సిపల్ కమిషనర్ శివారెడ్డి, కావలి ఎంపీడీవో సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

కరోనాకు చెక్ పెట్టేందుకు మరో ఔషధం

Niclosamide for COVID-19: ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా వైరస్‌కు విరుగుడు కనిపెట్టేందుకు శాస్త్రవేత్తలు రాత్రింబవళ్ళు శ్రమిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఇప్పటికే పలు రకాల ఔషధాలపై వివిధ దేశాల్లో...

TEST NEWS

WE ARE TRYING TEST NEWS

చేయూత పథకంతో మహిళల్లో ఆర్థిక సుస్థిరత… ఇన్చార్జ్ కమిషనర్

చేయూత పధకంతో మహిళల్లో ఆర్థిక సుస్థిరత ఇంచార్జ్ కమిషనర్ పార్ధసారధి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన వైఎస్సార్ చేయూత పధకంతో మహిళల్లో...

వైయస్సార్ చేయూత పథకం ప్రారంభించిన సీఎం జగన్

: ఏపీలో మహిళలకు జగన్ సర్కార్ మరో పథకానికి శ్రీకారం చుట్టింది. వైఎప్సార్ చేయూత పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. సీఎం క్యాంపు కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా.....

Recent Comments