Home Uncategorized ఇంటర్ అర్హతతో5846 కానిస్టేబుల్ ఉద్యోగాలు ...నోటిఫికేషన్

ఇంటర్ అర్హతతో5846 కానిస్టేబుల్ ఉద్యోగాలు …నోటిఫికేషన్

ఇంటర్ అర్హతతో 5846 కానిస్టేబుల్ జాబ్స్… నోటిఫికేషన్

పోలీస్ ఉద్యోగం మీ కలా? కానిస్టేబుల్ జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్నారా? అయితే మీకు శుభవార్త.

స్టాఫ్ సెలక్షన్ కమిషన్-SSC ఢిల్లీ పోలీస్ రిక్రూట్‌మెంట్ 2020 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.

మొత్తం 5846 ఖాళీలను ప్రకటించింది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్-SSC నుంచి వచ్చిన మరో భారీ జాబ్ నోటిఫికేషన్ ఇది.

ఇంటర్ పాసైనవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేయొచ్చు. దరఖాస్తు ప్రక్రియ 2020 ఆగస్ట్ 1న అంటే ఇవాళే ప్రారంభమైంది.

అప్లై చేయడానికి 2020 సెప్టెంబర్ 7 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను అభ్యర్థులు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అధికారిక వెబ్‌సైట్ https://ssc.nic.in/ లో తెలుసుకోవచ్చు.

ఇదే వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.

ఆంధ్రప్రదేశ్‌లో 26,778 ఉద్యోగాలు… వారం రోజుల్లోనే భర్తీ

మొత్తం కానిస్టేబుల్ పోస్టులు- 5846
కానిస్టేబుల్ మేల్- 3433
కానిస్టేబుల్ మేల్ ఎక్స్‌సర్వీస్‌మెన్- 226కానిస్టేబుల్ మేల్ ఎక్స్‌సర్వీస్‌మెన్ కమాండో- 243
కానిస్టేబుల్ ఫీమేల్- 1944
విద్యార్హత- 10+2 లేదా ఇంటర్మీడియట్ పాస్ కావాలి.
వయస్సు- 2020 జూలై 1 నాటికి 18 నుంచి 25 ఏళ్ల లోపు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు- రూ.100. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్‌సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు లేదు.

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- 2020 ఆగస్ట్ 1
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ- 2020 సెప్టెంబర్ 7
ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించడానికి చివరి తేదీ- 2020 సెప్టెంబర్ 9
ఆఫ్‌లైన్ చలానా జనరేట్ చేయడానికి చివరి తేదీ- 2020 సెప్టెంబర్ 11
ఆఫ్‌లైన్ చలానా పేమెంట్ చేయడానికి చివరి తేదీ- 2020 సెప్టెంబర్ 14 బ్యాంకింగ్ వేళలు ముగిసేవరకు
కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్- 2020 నవంబర్ 27 నుంచి డిసెంబర్ 14
తెలుగు రాష్ట్రాల్లో ఎగ్జామ్ సెంటర్స్- హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

కరోనాకు చెక్ పెట్టేందుకు మరో ఔషధం

Niclosamide for COVID-19: ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా వైరస్‌కు విరుగుడు కనిపెట్టేందుకు శాస్త్రవేత్తలు రాత్రింబవళ్ళు శ్రమిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఇప్పటికే పలు రకాల ఔషధాలపై వివిధ దేశాల్లో...

TEST NEWS

WE ARE TRYING TEST NEWS

చేయూత పథకంతో మహిళల్లో ఆర్థిక సుస్థిరత… ఇన్చార్జ్ కమిషనర్

చేయూత పధకంతో మహిళల్లో ఆర్థిక సుస్థిరత ఇంచార్జ్ కమిషనర్ పార్ధసారధి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన వైఎస్సార్ చేయూత పధకంతో మహిళల్లో...

వైయస్సార్ చేయూత పథకం ప్రారంభించిన సీఎం జగన్

: ఏపీలో మహిళలకు జగన్ సర్కార్ మరో పథకానికి శ్రీకారం చుట్టింది. వైఎప్సార్ చేయూత పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. సీఎం క్యాంపు కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా.....

Recent Comments