హోమ్ ఐసోలేషన్ లో ఉన్న వారికి మందుల జాబితా

0
54

: గుంటూరు: కరోనా వైరస్‌ సోకి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సూచన మేరకు స్వీయ గృహనిర్బంధంలో ఉన్న వారు కొన్ని మందులు వాడాలని జిల్లా కలెక్టర్‌ ఐ.శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌ సూచించారు. హోం ఐసోలేషన్‌లో ఉన్న పాజిటివ్‌ వ్యక్తులకు ప్రభుత్వం ఒక కిట్‌ పంపిణీ చేస్తుందన్నారు. ఎలాంటి వ్యాధి లక్షణాలు బయటికి కనిపించకపోయినప్పటికీ ఆరు రకాల మందుల తప్పక వాడాలని సూచించారు.

విటమిన్‌-సీ 500 ఎంజీ మాత్రలు బలానికి ఉదయం 1, రాత్రి భోజనం చేసిన తర్వాత ఒకటి 10 రోజులు.
కాల్షియం+డీ3 ట్యాబ్లెట్లు కూడా ఉదయం ఒకటి, రాత్రి భోజనం తర్వాత ఒకటి.
జింక్‌ సల్ఫేట్‌-20 ట్యాబ్లెట్లు కూడా ఉదయం 1, రాత్రి భోజనం చేసిన తర్వాత ఒకటి.
బలానికి ఉపయోగించే ఎంవీటీ ట్యాబ్లెట్లు నిత్యం మధ్యాహ్నం భోజనం తర్వాత ఒకటి.
ట్‌లో శానిటైజర్‌(180 ఎంఎల్‌) బాటిల్‌, 20 డిస్పోజబుల్‌ ఫేస్‌మాస్కులు ఉంటాయి.
లక్షణాలు కనిపిస్తే…

కరోనా వైరస్‌ లక్షణాలు కనిపిస్తే ఎజిత్రోమైసిన్‌ 500 ఎంజీ మాత్రలు రాత్రికి భోజనం చేసిన తర్వాత ఒకటి చొప్పున ఐదు రోజులు వేసుకోవాలి.
జ్వరం, ఒళ్లు నొప్పులు ఉన్నప్పుడు భోజనం చేసిన తర్వాత ఉదయం, మధ్యాహ్నం, రాత్రికి పారసిటమాల్‌ 500 ఎంజీ వేసుకోవాలి.
జలుబు ఉంటే రాత్రి భోజనం చేసిన తర్వాత సెట్రిజిన్‌ హెచ్‌సీఎల్‌ మాత్ర ఐదు రోజులు వేసుకోవాలి.
గ్యాస్‌ట్రబుల్‌ ఉంటే పరగడుపున ప్యానట్రోజోల్‌ 40 ఎంజీ మాత్రలు 10 రోజులు వేసుకోవాలి.
జలుబు, దగ్గుకు సీపీఎం సిరప్‌ ఇస్తోన్నామని, దానిని రెండు మూతల మందు, రెండు మూతల నీళ్లు కలిపి రాత్రి భోజనం చేసిన తర్వాత సేవించాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here