రాష్ట్రంలో అర్హులైన అందరికీ గృహాలు మంజూరు చేస్తాం.. కలెక్టర్

0
25

రాష్ట్రంలో అర్హులైన వారందరికీ సొంత గృహాలు

రాష్ట్ర ముఖ్యమంత్రి ఇళ్లు లేని పేదలు ఎవ్వరూ ఉండకూడదని అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రతిష్టాత్మకంగా ఇళ్ల పట్టాల పంపిణీకి శ్రీకారం చుట్టామని జిల్లా కలెక్టర్ చక్రధర బాబు పేర్కొన్నారు. విడవలూరు గ్రామంలో కాసేపటి క్రితమే ఆయన పర్యటించారు ఇళ్లులేని పేదలందరికీ పట్టాలు అందించడానికి ప్రభుత్వం, అధికారులు నిబద్ధతతో పనిచేస్తున్నారని.., అర్హులందరికీ తప్పకుండా న్యాయం చేస్తామని కలెక్టర్ తెలిపారు.

తొలుత ఎమ్మార్వో కార్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్.., ఆర్డీఓ, ఎమ్మార్వోతో భేటీ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం పేదలకు అందిచనున్న ఇళ్ల పట్టాల పంపిణీపై సమీక్షించారు. అనంతరం విడవలూరు లో పేదలు ఇవ్వడానికి సిద్ధం చేసిన.., ఇళ్ల ప్లాట్ల లే అవుట్ ని కలెక్టర్ పరిశీలించారు. లే అవుట్ లో ఎంతమంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తున్నారు..? అర్హులందరికీ పట్టాలు అందిస్తున్నారా..? లే అవుట్ లో అంతర్గత రోడ్లు, మార్కింగ్ ని పరిశీలించారు. పేదలకు ఇవ్వనున్న లే అవుట్ లో.., ఉన్న విద్యుత్తు లైన్ ని చూసిన కలెక్టర్ దానిని లే అవుట్ నుంచి తొలగించి, లే అవుట్ వెలుపలగా వెల్లేలా నిర్మించాలని ఆర్డీఓను ఆదేశించారు. ఇప్పటికే విద్యుత్తు లైన్ ను మార్చడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయని.., ఆర్డీఓ హుస్సేన్ సాహెబ్ కలెక్టర్ కి తెలిపారు. లే అవుట్ లో పేదలకు ఇవ్వడానికి ఇళ్ల పట్టాలు సిద్ధం మయ్యాయని.., లాటరీ ప్రక్రియ కూడా పూర్తైందని కలెక్టర్ తెలిపారు. అనంతరం లే అవుట్ లో ఇళ్ల పట్టాలు పొందిన ప్రజలు కలెక్టర్ ని కలిశారు. తమకు ఇళ్ల ప్లాట్లు ఇస్తుంన్నందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. బోధ కాలుతో బాధపడుతున్న వృద్ధురాలు కలెక్టర్ ని కలిసి తనకు ఏదైనా లోన్ అందించి సహాయం చేయాలని కోరారు. ఆమె పరిస్థితిని గమనించి కలెక్టర్.., ప్రభుత్వం తరఫున నిబంధనల ప్రకారం అందాల్సిన సహాయం అందించాలని గ్రామకార్యదర్శిని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో అధికారులు, ఇళ్ల పట్టాలు పొందిన వారు, స్థానికులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here