ఈయనకు అప్పగిస్తే నూరుశాతం సక్సెస్

0
103

: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో సౌమ్యుడిగా ఆయనకు పేరుంది. అంతేకాదు ఆయననకు అప్పగించిన బాధ్యతలను వంద శాతం పూర్తి చేస్తారని పార్టీ అధినేత జగన్ కు నమ్మకం. పెద్దగా హడావిడి చేయరు. జగన్ ఆదేశాలను తూచ తప్పకుండా అమలు చేస్తారు. చాప కింద నీరులా అంతా సర్దేస్తారు. ఆయనే రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రస్తుతం వైసీపీలో కీలక నేతగా మారారు.

పారిశ్రామికవేత్తగానే కాకుండా.

వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పారిశ్రామిక వేత్తగా పేరుంది. పారిశ్రామికవేత్తగానే ఉంటూ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వీపీఆర్ ట్రస్ట్ ద్వారా కోట్లాది రూపాయలు వెచ్చించి సేవా కార్యక్రమాలను చేపట్టారు.ప్రధానంగా గ్రామీణ ప్రాంతాలకు తన సొంత ఖర్చుతో ట్రస్ట్ ద్వారా మంచినీటి సౌకర్యం కల్పించారు. ప్రతి గ్రామంలో మెడికల్ క్యాంప్ లను ఏర్పాటు చేసి వైద్య సహాయాన్ని అందిస్తున్నారు. దీంతోవేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ప్రజల్లో పేరొచ్చింది. దీంతో ఆయన రాజకీయాల్లోకి రావాలనుకున్నారు.

తిరిగి చేరి రాజ్యసభకు..

2014లో ఆయన వైసీపీ నుంచి రాజ్యసభ సీటును ఆశించారు. కానీ జగన్ అప్పుడు ఇవ్వకపోవడంతో వైసీపీకి కొంతకాలం దూరంగా ఉన్నారు. ఒక దశలో టీడీపీకి దగ్గరవ్వాలనుకున్నారు. కానీ స్థానిక టీడీపీ నాయకత్వం ఆయన రాకను అడ్డుకుందంటారు. దీంతో తిరిగి మొన్నటి జగన్ పాదయాత్రలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తిరిగి వైసీపీ కండువా కప్పుకున్నారు. ఆ వెనువెంటనే జగన్
వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని రాజ్యసభకు పంపారు.

కీలక బాధ్యతలు…

మొన్నటి ఎన్నికల్లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు జిల్లాలో వైసీపీ క్లీన్ స్వీప్ చేయడానికి ఒక కారణంగా చెబుతారు. తాజాగా జగన్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి కర్నూలు, ప్రకాశం జిల్లాల బాధ్యతలను అప్పగించారు. రెండు జిల్లాల్లోనూ పార్టీ పరంగా అనేక సమస్యలున్నాయి. కొండపి, చీరాల, దర్శి, అద్దంకి నియోజకవర్గాల్లో, వైసీపీ నేతల మధ్య విభేదాలున్నాయి. అలాగే కర్నూలు జిల్లాలోనూ నందికొట్కూరు, కర్నూలు టౌన్, కోడు మూరు నియోజకవర్గాలను కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సరిదిద్దాల్సి ఉంది. మరి ఆయనపై పెట్టిన బాధ్యతను వంద శాతం పూర్తి చేస్తారన్న నమ్మకాన్ని ఏ మేరకు నిలబెట్టుకుంటారో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here